Udhaya kanthi rekalo lyrics ఉదయ కాంతి రేఖలో - బెత్లెహేము పురమున

ఉదయ కాంతి రేఖలో
పల్లవి:     ఉదయ కాంతి రేఖలో - బెత్లెహేము పురమున
అవతరించెను బాల యేసు - పాపాలు మోయు గొర్రె పిల్ల
పాపాలు మోయు గొర్రె పిల్ల
1.        పరమ పుత్రుని మోహన రూపుగని - తల్లి మరియ మురిసే
బాల యేసుని మహిమ రూపు -  ఈ జగానికి వెలుగై
గొల్లలు జ్ఞానులు పరిశుద్దులు - ప్రస్తుతించిరి బాల యేసుని    .. ఉదయ..
2.        ఆకాశ తారల మెరుపు కాంతిలో - ప్రక్రుతి రాగాల స్వరాలతో
హల్లెలూయ యని పాడుచు - దూత గణము స్తుతించిరి
జగ మొక ఊయలగా చేసి - దూతలు పాడిరి జోల పాట       .. ఉదయ.

Powered by Blogger.