పదివేలలోని అతికాంక్షణీయుడు ఎంతో వికారుడాయెన్ నా నిమిత్తమే శాపగ్రస్థుడై ఘోరాసిలువను మోసి వహించెన్ ఈ గొప్పప్రేమ నేను మరువన్ జీవితకాలములో|| పదివేలలోని || గాయములను శిక్షనిందను నా శాంతి నిమిత్తమే గదా నీ శరీరములో పొందితిని నా ప్రియా యేసుదేవా|| పదివేలలోని || అన్యాయమైన తీర్పును పొంది వ్రేలాడేను హీన దొంగల మధ్య సింహాసనమున నీతో నేనుండి సదా పాలించుటకే|| పదివేలలోని || మరణము ద్వారా కృప నొసంగి అక్షయజీవము నిచ్చితివి మహిమనుండి అధిక మహిమపొంది మార్పు నొందుటకేగా|| పదివేలలోని || నీ రూపం చూచి సిలువను మోసి నీతో నడచి సేవను చేసి నా ప్రాణము నీకే అర్పింతును కడవరకు కాపాడుము