Adhigadhigo paralokamu numdi dhigi vacche vadhuvu sangamu అదిగదిగో పరలోకము నుండి దిగివచ్చే వధువు సంఘము


Song no: 148

అదిగదిగో పరలోకము నుండి  
దిగివచ్చే వధువు సంఘము 
వరుణివలే పరిపూర్ణ  సౌందర్యమును ధరించుకున్నది2
అల్ఫా ఓమేఘయైన నాప్రాణప్రియునికి     
నిలువెల్ల నివేదించి మైమరతునే2
నాయేసురాజుతో లయము కాని రాజ్యములో 
ప్రవేశింతునే... పరిపూర్ణమైన పరిశుద్ధులతో2॥॥అదిగదిగో

కళ్యాణ రాగాలు ఆత్మీయ క్షేమాలు
తలపోయుచూనే పరవశింతునే 2
రాజాధిరాజుతో స్వప్నాల సౌధములో
విహరింతునే. నిర్మలమైన వస్త్రధారినై2॥॥అదిగదిగో

జయించినవాడై సర్వాధికారియై
సింహాసనాశీనుడై నను చేర్చుకొనును 2
సీయోను రాజుతో రాత్రిలేని రాజ్యములో     

ఆరాధింతునే.. వేవేల దూతల పరివారముతో 2॥॥అదిగదిగో
أحدث أقدم