Vijaya geethamu manasara nenu padadha విజయగీతము మనసార నేను పాడెద నా విజయముకై


Song no: 142
విజయగీతము మనసార నేను పాడెద
నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు
పునరుత్థానుడా నీవే నా ఆలాపన నీకే నా ఆరాధన

1. ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్యజీవముకే
   పుటమువేసితివే నీ రూపము చూడ నాలో
   యేసయ్యా నీ తీర్మానమే
   నను నిలిపినది నీ ఉత్తమమైన సంఘములో    ||పునరు||

2. ఒకని ఆయుష్షు ఆశీర్వాదము నీ వశమైయున్నవి
   నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో
   యేసయ్యా నీ సంకల్పమే
   మహిమైశ్వర్యము నీ పరిశుద్ధులలో చూపినది   ||పునరు||

3. నూతన యెరూషలేం సీయోను నాకై నిర్మించుచున్నావు నీవు
    నిరీక్షణయే రగులుచున్నది నాలో
   యేసయ్యా నీ ఆధిపత్యమే

   అర్హత కలిగించే నీ ప్రసన్న వదనమును ఆరాధించ       ||పునరు||
أحدث أقدم