Manasa nee priyudu yesu nee pakshamai nilichene మనసా నీ ప్రియుడు యేసు నీ పక్షమై నిలిచెనే

Song no: 133

మనసా నీ ప్రియుడు యేసు నీ పక్షమై నిలిచెనే
మహదానందమే తనతో జీవితం
ఓ మనసా ఇది నీకు తెలుసా!

దివ్యమైన సంగతులెన్నో నీ ప్రియుడు వివరించగా
ఉత్సాహ ధ్వనులతో వూరేగితివే
ఉరుముల ధ్వనులన్నీ క్షణికమైనవేగా
దిగులు చెందకే ఓ మనసా
              ౹౹మనసా౹౹

ఆశ్చర్య కార్యములెన్నో నీ ప్రియుడు చేసియుండగా
సంఘము ఎదుట నీవు సాక్షివైతివే
ఇహలోక శ్రమలన్ని స్వల్పమేగా
కలవరమేలనే ఓ మనసా
            ౹౹మనసా౹౹

నిష్కళoకరాలవు నీవని నీ ప్రియుడు నిను మెచ్చెనే
కృపాతిశయముచే నీవు ఉల్లసించితివే
దుష్టుల క్షేమము నీ కంట బడగా
మత్సరపడకే ఓ మనసా
         ౹౹మనసా౹౹
|| goto ||

أحدث أقدم