Sugunala sampannuda Lyrics 100


సుగుణాల సంపన్నుడా - స్తుతిగానాలవారసుడా
జీవింతును నిత్యము నీ నీడలో - ఆస్వాదింతును నీ మాటల మకరందము
1. యేసయ్య నీతో జీవించగానే - నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే
నాట్యమాడెను నా అంతరంగము - ఇది రక్షణానంద భాగ్యమే      "సుగుణాల"
2. యేసయ్య నిన్ను వెన్నంటగానే - ఆజ్ఞల మార్గము కనిపించెనే
నీవు నన్ను నడిపించగలవు - నేను నడువ వలసినత్రోవలో        "సుగుణాల"
3. యేసయ్య నీ కృప తలంచగానే - నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే
నీవు నాకిచ్చే మహిమయెదుట - ఇవి ఎన్న తగినవికావే              "సుగుణాల"
Powered by Blogger.