naa hrudhayamulo nee matale lyrics 179
నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతిరేఖలు 2
కారు చీకటిలో కలువరి కిరణమై
కఠినహృదయమును కరిగించినావు
నీ కార్యములను వివరింపతరమా ? నీ ఘనకార్యములు వర్ణింపతరమా ?
మనసులో నెమ్మదిని కలిగించుటకు మంచువలె కృపను
కురిపించితివి2
విచారములు కొట్టివేసి విజయానందముతో నింపినావు
నీరు పారేటి తోటగా చేసి సత్తువగల భూమిగా
మార్చినావు
విరజిమ్మె ఉదయకాంతిలో నిరీక్షణ ధైర్యమును
కలిగించితివి 2
అగ్నిశోధనలు జయించుటకు మహిమాత్మతో నింపినావు
ఆర్పజాలని జ్వాలగా చేసి ద్వీపస్థంభముపై నను నిలిపినావు
పవిత్రురాలైన కన్యకగా పరిశుద్ధ జీవితం చేయుటకు
పావన రక్తముతో కడిగి పరమానందముతో నింపినావు
సిద్ధపడుచున్న వధువుగా చేసి సుగుణాల సన్నిధిలో
నను నిలిపినావు