Naa kentho anandham nee sannidhi prabhuvaa నా కెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా

Song no: 85

    నా కెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా
    నీలో నేనుండుటే అదే నా ధన్యతయే

  1. ఏ అపాయము నను సమీపించక
    ఏ రోగమైనను నా దరికి చేరక } 2
    నీవు నడువు మార్గములో నా పాదము జారక
    నీ దూతలే నన్ను కాపాడితిరా || నా కెంతో ||

  2. నా వేదనలో నిన్ను వేడుకొంటిని
    నా రోదనలో నీకు మొఱ్ఱ పెట్టితిని } 2
    నా కన్నీటిని తుడిచి నీ కౌగిట చేర్చితివా
    నా కన్న తండ్రివై కాపాడుచుంటివా || నా కెంతో ||
أحدث أقدم