Nithyudagu naa thandri neeke sthothramu నిత్యుడగు నా తండ్రి నీకే స్తోత్రము

Song no: 45

    నిత్యుడగు నా తండ్రి నీకే స్తోత్రము
    తరతరముల నుండి ఉన్నవాడవు
    ఆది అంతము లేని ఆత్మా రూపుడా
    ఆత్మతో సత్యముతో అరాధింతును
    నిత్యుడగు నా తండ్రి

  1. భూమి ఆకాశములు గతించినా
    మారనే మారని నా యేసయ్యా
    నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడా ॥ నిత్యుడగు ॥

  2. సిలువలో నీవు కార్చిన రుధిరధారలే
    నా పాపములకు పరిహారముగా మారెనులే
    కొనియాడి పాడి నేను నాట్యం చేసెద ॥ నిత్యుడగు ॥

  3. నూతన యెరూషలేముకై సిద్ధపదెదను
    నూతన సృష్టిగ నేను మారెదను
    నా తండ్రి యేసయ్యా ఆత్మదేవ స్తోత్రము ॥ నిత్యుడగు ॥
أحدث أقدم