Viluvainadhi samayamu o nesthama విలువైనది సమయము ఓ నేస్తమా


Song no:

విలువైనది సమయము ఓ నేస్తమా
ఘనమైనది జీవితం  ఓ ప్రియతమా
సమయము పోనివ్వక సద్భక్తితో సంపూర్ణతకై సాగేదము

1. క్రీస్తుతో మనము లెపబడిన వారమై
పైనున్నవాటినే వెదకిన యెడల
గొర్రెపిల్లతొ కలిసి సీయోను శిఖరముపై నిలిచెదము.
                                  // విలువై//

2. శోధన మనము సహించిన వారమై
క్రీస్తుతొ మనము శ్రమించిన యెడల
సర్వాధికారియైన ప్రభువుతో కలిసి ఏలెధము           // విలువైనది//

3.క్రీస్తుతో మనము సింహాసనముపై
పాలించుటకై జయమొంధుటకు
సమర్పణ కలిగి పరిశుద్దతలో నిలిచెధము         // విలువైనది//
أحدث أقدم