Nijamaina drakshavalli neeve nithyamaina santhoshamu neelone నిజమైన ద్రాక్షావల్లి నీవే నిత్యమైన సంతోషము నీలొనే

Song no:

నిజమైన ద్రాక్షావల్లి నీవే
నిత్యమైన సంతోషము నీలొనే
శాశ్వతమైనది ఎంతో మధురమైనదీ
నాపైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ

1. అతికాంక్షనీయుడా దివ్యమైన నీ రూపులో
జీవించుచున్నాను నీ ప్రేమకు నే పత్రికగా
శిధిలమైయుండగా నేను నీదు రక్తముతో కడిగి
నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా
                          // నిజమైన//

2. నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో
అర్పించుచున్నాను సర్వమూనీకే అర్పణగా
వాడిపోనీవ్వక నాకు ఆశ్రయమైతివి నీవు
జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా
                          // నిజమైన//

3. షాలేము రాజా రమ్యమైన సీయోనుకే
నను నడిపించుము నీ చిత్తమైన మార్గములో
అలసీ పోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి
ఆదరణకర్తవై నను చేర్చుము నీ రాజ్యములో
                             // నిజమైన//


أحدث أقدم