Naa jeevam nee krupalo djachithive నా జీవం నీ కృపలో దాచితివే - నా జీవితకాలమంతా 

Song no: 17
    నా జీవం నీ కృపలో దాచితివే - నా జీవితకాలమంతా
    ప్రభువా నీవే నా ఆశ్రయం - నా ఆశ్రయం
    నా జీవం నీ కృపలో దాచితివే

  1. కానాను యాత్రలో యోర్దాను అలలచే కలత చెందితినే -2
    కాపరివైన నీవు దహించు అగ్నిగా నా ముందు నడిచితివే -2     ॥ నా జీవం ॥

  2. వాగ్దానా భూమిలో మృతసముద్రపు భయము నన్ను వెంటాడెనే -2
    వాక్యమైయున్న నీ సహవాసము ధైర్యము పుట్టించెనే -2    ॥ నా జీవం ॥

  3. స్తుతుల మధ్యలో నివసించువాడా స్తుతికి పాత్రుడా -2
    స్తుతియాగాముగా నీ సేవలో ప్రాణార్పణ చేతునే -2      ॥ నా జీవం ॥


أحدث أقدم