Sreemanthuda yesayya na athmaku abhishekama శ్రీమంతుడా యేసయ్య నా ఆత్మకు అభిషేకమా

Song no: 60

    శ్రీమంతుడా యేసయ్యా
    నా ఆత్మకు అభిషేకమా
    నా అభినయ సంగీతమా } 2

  1. సిలువధారి నా బలిపీఠమా
    నీ రక్తపు కోట నాకు నివాసమా } 2
    నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా
    ఇదియే నీ త్యాగ సంకేతమా } 2 || శ్రీమంతుడా ||

  2. మహిమగల పరిచర్య పొందినందున
    అధైర్యపడను కృప పొందినందున } 2
    మహిమతో నీవు దిగి వచ్చువేళ
    మార్పునొందెద నీ పోలికగా } 2 || శ్రీమంతుడా ||

  3. సీయోను శిఖరము సింహాసనము
    వరపుత్రులకే వారసత్వము } 2
    వాగ్దానములన్ని నేరవేర్చుచుంటివా
    వాగ్దానపూర్ణుడా నా యేసయ్యా } 2 || శ్రీమంతుడా ||

أحدث أقدم