Naa priyudu yesu naa priyudu naa priyuniki ne నా ప్రియుడు యేసు నా ప్రియుడు నా ప్రియునికి నే

Song no: 38

    నా ప్రియుడు యేసు నా ప్రియుడు
    నా ప్రియునికి నే స్వంతమెగా } 2

    నా ప్రియుడు నావాడు } 2 ||నా ప్రియుడు||

  1. మరణపు ముల్లును నా లో విరిచి
    మారాను మధురం గా చేసి } 2
    మనస్సును మందిరము గా మార్చే } 2 ౹౹నా ప్రియుడు ౹౹

  2. కృపనే ధ్వజముగా నాపై నెత్తి
    కృంగిన మదిని నింగి కెత్తి } 2
    కృపతో పరవశ మొందించే } 2 ౹౹నా ప్రియుడు ౹౹

  3. సంఘముగా నను చేర్చుకొని
    సంపూర్ణ నియమములన్నియును } 2
    సంగీతముగా వినిపించే } 2 ౹౹నా ప్రియుడు ౹౹

  4. జీవితమే జలరేఖలుగా
    చెదిరిన సమయములన్నింటిలో } 2
    పిలుపును స్థిరపరచే కృపలో } 2 ౹౹నా ప్రియుడు౹౹

  5. సంబరమే యేసు కౌగిలిలో
    సర్వాంగ సుందరుడై వచ్చువేళ } 2
    సమీపమాయే ఆ శుభవేళ } 2 ౹౹ నా ప్రియుడు ౹౹
أحدث أقدم