Anandhame prabhu yesuni sthuthinchuta ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట

Song no: 30

    ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట
    ఆత్మానంద గీతముల్ పాడెద.

  1. సిలువలో నాకై రక్తము కార్చెను
    సింహాసనమునకై నన్నును పిలిచెను
    సింహపుకోరల నుండి నన్ను విడిపించెను

  2. విశ్వాసమును కాపాడుకొనుచూ
    విజయుడైన యేసుని ముఖమును చూచుచూ
    విలువైన కిరీటము పొందెద నిశ్చయము

  3. నా మానస వీణను మ్రోగించగా
    నా మనో నేత్రములందు కనిపించె ప్రభు రూపమే
    నా మదిలోన మెదిలేను ప్రభు సప్తస్వరాలు
Previous Post Next Post