Song no: 185
- విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా}
- అలసిన సమయమున}
నా ప్రాణములో త్రాణ పుట్టించినావు }॥2॥
ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి}
ధైర్యముతో నింపినావు}॥2॥
నిత్యానందము కలిగించే నీ}
శుభ వచనములతో నెమ్మదినిచ్చితివి}॥2॥ || విజయశీలుడా ||
- ఆశ్చర్యకరముగ నీ బాహువు చాపి }
విడుదల కలిగించినావు}॥2॥
అరణ్య మార్గమున విడువక తోడై}
విజయముతో నడిపినావు}॥2॥
నీ స్వాస్థ్యమునకు తండ్రిగ నిలిచి}
వాగ్ధాన భూమిలో చేర్చిన దేవా}॥2॥ || విజయశీలుడా ||
- ఆరోగ్యకరమైన నీ రెక్కల నీడలో}
ఆశ్రయమిచ్చితివి నాకు}॥2॥
అక్షయుడా నా సంపూర్ణతకై}
మహిమాత్మతో నింపినావు}॥2॥
నిత్యము నీతో నేనుండుటకై}
నూతన యెరూషలేము నిర్మించుచున్నావు }॥2॥ || విజయశీలుడా ||
కృతజ్ఞతతో నిను స్తుతించెదను}॥2॥
నా యేసయ్యా నిను వేడుకొనగా}
నా కార్యములన్నియు సఫలము చేసితివి }॥2॥ || విజయశీలుడా ||