Anuragalu kuripinche nee prema thalachi అనురాగాలు కురిపించే నీ ప్రేమ తలచి

Song no: 167

    అనురాగాలు కురిపించే నీ ప్రేమ తలచి
    అరుదైన రాగాలనే స్వరపరచి
    ఆనందగానలే సప్త స్వరాలుగా నే పాడనా

  1. యేసయ్య నా హృదయ సీమను ఏలుమయ
    నీ దివ్య సన్నిది చాలునయ || అనురాగాలు ||

  2. నీ జ్ఞాన ఆత్మయే వికసింపచేసెను నన్ను
    సర్వ సత్యములలో నే నడచుటకు
    మరపురాని మనుజాశాలను విడిచి
    మనసార కొనియాడి జీవించెద ఇక నీ కోసమే || అనురాగాలు ||

  3. అపురూప దర్శనమే బలపరుచుచున్నది నన్ను
    వెనుదిరిగి చూడక పోరాడుటకు
    ఆశ్చర్యకరమైన నీ కృప పొంది
    కడవరకు నీ కాడినే మోయుట నా తుది నిర్ణయమే || అనురాగాలు ||

  4. నీ నీతి నియమములే నడిపించుచున్నది నన్ను
    స్వర్ణ కాంతిమయమైన నగరము కొరకు } 2
    అమూల్యమైన విశ్వాసము పొంది
    అనుక్షణము నిన్ను తలచి హర్షించేనే నాలో నా ప్రాణమే || అనురాగాలు ||

أحدث أقدم