వందనాలు వందనాలు - వరాలు పంచే నీ గుణ సంపన్నతకు (2)
నీ త్యాగ శీలతకు నీ వశమైతి నే - అతి కాంక్షనీయుడా నా యేసయ్యా (2) ||వందన||
1. ఇహలోక ధననిధులన్నీ - శాశ్వతముకావని ఎరిగితిని (2)
ఆత్మీయ ఐశ్వర్యము పొందుట కొరకే - ఉపదేశ క్రమమొకటి మాకిచ్చితివి ||వందన||
2. యజమానుడా నీవైపు - దాసుడనై నా కన్నులెత్తగా (2)
యాజక వస్త్రములతో ననుఅలంకరించి - నీ ఉన్నత పిలుపును స్థిరపరచితివే (2) ||వందన||
3. ఆద్యంతములేని - అమరత్వమే నీ స్వంతము (2)
నీ వారసత్వపు హక్కులన్నియు - నీ ఆజ్ఞను నెరవేర్చగ దయచేసితివి (2) ||వందన||
_______________________________________
Vandanaalu vandanaalu
varalu panche nee guna sampannathaku
Nee tyagasheelataku nee vasamaitine -
Athi kankshaneeyuda na yesayya (2) ||Vandana||
Ehaloka dhananidhulanni - shashwathamu kavani yerigithini (2)
Aathmiya aishwaryamu ponduta koraku
Upadeshamu maakichitivi (2) ||Vandana||
Yajamanuda neevaipu dasudanaina na kannulettaga(2)
Yaajaka vastramulatho nanu alankarinchi nee unnatha pilupunu sthiraparachithive (2) ||Vandana||
Aadyantamuleni amaratvame - nee swantamu (2)
nee vaarasatvapu hakkulanniyu naa aajnanu neraverchaga dayachesitivi (2) ||Vandana||