Neeve hrudhaya saaradhi pragathiki vaaradhi నీవే హృదయ సారధి ప్రగతికి వారధి

Song no:
    నీవే హృదయ సారధి ప్రగతికి వారధి
    నీ స్నేహమే సౌభాగ్యము సంక్షేమ సంతకం
    నా పాటకే సౌందర్యము నీవే యేసయ్యా

  1. మదిలో చేదు జ్ఞాపకాల విలయ వేదిక కూల్చి
    చిగురాశల దిశగా నను పయనింపజేసినా
    నీ మాటలు స్థిరపరచెను విశ్వాస ప్రేమలో
    కలనైనా అనుకోని అనురాగ బంధమైతివే || నీవే హృదయ ||

  2. నీవు లేని జీవితం ప్రళయసాగరమే
    దిక్కు తోచని సమయములో నీవే దిక్సూచివై
    చుక్కానిగ నడిపించుము ఆత్మీయ యాత్రలో
    కనుపాపగ నను కాచిన నా మంచి కాపరి || నీవే హృదయ ||

  3. చేరనైతి కోరనైతి స్నేహ సౌధము
    చిరుదివ్వెగ దరిచేరి చేర్చావు సన్నిధి
    చావైనా బ్రతుకైనా నీ కోసమే ప్రభు
    చాటింతును నీ ప్రేమను ప్రణుతింతు ప్రేమ సాగరా || నీవే హృదయ ||


    Neeve hrudhaya saaradhi pragathiki vaaradhi
    nee snehame soubhaagyamu samkshema santhakam
    naa paatake soundharyamu neeve yesayyaa

  1. Madhilo chedhu gnaapakaala vilaya vedhika koolchi
    chiguraasala disagaa nanu payanimpa jesinaa
    nee maatalu sthiraparachenu viswaasa premalo
    kalanainaa anukoni anuraaga bandhamaithive || Neeve hrudhaya ||

  2. Neevu leni jeevitham pralaya saagarame
    dhikku thochani samayamulo neeve dhiksoochivai
    chukkaaniga nadipinchumu aathmeeya yaathralo
    kanupaapaga nanu kaachina naa manchi kaapari || Neeve hrudhaya ||

  3. Cheranaithi koranaithi sneha soudhamu
    chirudivvega dharicheri cherchaavu sannidhi
    chaavainaa brathukainaa nee kosame prabhu
    chaatinthunu nee premanu pranuthinthu prema saagaraa || Neeve hrudhaya ||



Previous Post Next Post