Neetho naa jivitham santhoshame neetho naa anubhandham madhuryame నీతో నా జీవితం సంతోషమే నీతో నా అనుబందం మాధూర్యమే

Song no:

నీతో నా జీవితం సంతోషమే
నీతో నా అనుబందం మాధూర్యమే
నా యేసయ్యా  కృపచూపుతున్నావు   వాత్సల్యపూర్నుడవై
నా యేసయ్యా నడిపించుచున్నావు   స్పూర్తి ప్రదాతవై
ఆరాధ్యుడా యేసయ్యా  నీతోనా అనుబంధం మాధూర్యమే

1. భీకర ధ్వని గల మార్గము నందు
నను స్నేహించిన నా ప్రియుడవు నీవు
కలనైన మరువను నీవు నడిపిన మార్గం
క్షణమైన విడువను నీతో సహవాసం     
                           // ఆరాధ్యుడా//

2.సంతోషమందైన శ్రమలయందైనను
నా స్తుతి కీర్తనకు ఆధారము నీవు           
నిత్యమైనమహిమలో నను నిలుపుటకు
శుద్ధసువర్ణముగ నను మార్చుచున్నావు
                          // ఆరాధ్యుడా//

3. ఆకాశమందుండి ఆశీర్వదించితివి
అభాగ్యుడనైన నేను కనికరింపబడితిని
నీలో నిలుచుటకు బహుగా పలించుటకు
నూతన కృపలతో నను నింపుచున్నావు.
                         //  ఆరాధ్యుడా//
أحدث أقدم